ప్రజాశక్తి - తాళ్లరేవు ముమ్మిడివరం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం సందర్భంగా కుడిపుడి శివన్నారాయణ భారీ ర్యాలీ నిర్వహించారు. ఆయన స్వగ్రామం పత్తిగొంది నుంచి జోరు వానను లెక్కచేయక వైసిపి కార్యకర్తలు, అభిమానులతో భారీ ర్యాలీ నిర్వహించారు. తొలుత రామాలయం వద్ద శివన్నారాయణ పూజలు నిర్వహించారు. అనంతరం పెద్దపేటలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. పి.మల్లవరం నుంచి ముమ్మిడివరం మీదుగా మహిపాల చెరువు వద్దకు బయలుదేరారు. మధ్యలో వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేశారు. వేలాదిమంది వెంట రాగా భారీ బైక్ ర్యాలీ జరిగింది.










