ప్రజాశక్తి -పిఎం పాలెం: విశాఖ ద్వారకానగర్‌కు చెందిన కూచిపూడి నృత్యకళాకారిణి అనిపిండి అరుణ నాట్యరత్న పురస్కారాన్ని స్వీకరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఈనెల 6న హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించిన మహిళల విశిష్ట కీర్తి పురస్కారాల ప్రదానంలో భాగంగా అనిపిండి అరుణకు ఒడిస్సీ లెజెండరీ డ్యాన్సర్ షరాన్ లోవర్ నాట్యరత్న పురస్కారన్ని అందించారు. తార అకాడమీ ఆధ్వర్యంలో నాట్యరంగానికి నృత్య కళాకారిణి అరుణకు ఈ పురస్కారాన్ని అందించారు. కాగా ఈ ఏడాది జనవరిలోనూ అండమాన్ నికోబార్ ఐల్యండ్ దీవుల్లో నిర్వహించిన అండమాన్ కళోత్సవ్ సంక్రాంతి సంబరాల్లోనూ జాతీయస్థాయి అవార్డును అరుణ అందుకున్నారు. విశేష అతిథులు భాగవతుల సేతురామ్, మంజుభార్గవి, అరుణ భిక్షు, డాక్టర్ కృష్ణమోహనరావు, తెలంగాణ బిసి కమిషన్ చైర్మన్ వంటి ప్రముఖుల సమక్షంలో అవార్డు అందుకోవడం ఆనందంగా ఉందని అరుణ వెల్లడించారు. పురస్కార గ్రహీత అరుణను పలువురు కళాప్రియులు అభినందించారు.










