Nov 01,2023 22:30

 పంజాబ్‌ విశ్వవిద్యాలయం విద్యార్థుల ప్రశంస
ప్రజాశక్తి - మొవ్వ :
భారతదేశంలోని శాస్త్రీయ నృత్యాలలో నేటికీ నవ్యత చెడకుండా ప్రజాధరణపొందుతున్న కూచిపూడి నాట్యం అజరామరమని పంజాబ్‌ కు చెందిన గురునానక్‌ దేవ్‌ విశ్వ విద్యాలయం అధ్యాపకులు, ఆర్కిటెక్‌ విద్యార్థులు కొనియాడారు. ఏక్‌ భారత్‌ శ్రేష్ఠ భారత్‌ క్లబ్‌ ఆఫ్‌ స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ ఆర్కిటెక్చర్‌(విజయవాడ) సారధ్యంలో పంజాబ్‌ రాష్ట్రంలోని గురునానక్‌ దేవ్‌ యూనివర్సిటీ,(అమ్రిస్టార్‌) విద్యార్థిని విద్యార్థులు టీం లీడర్లు జయేశ్‌ కుమార్‌ భాగవత్‌,డాక్టర్‌ గోపాల్‌ జోహ్రీ, డాక్టర్‌ కిరణ్‌ సంధ్‌ నేతత్వంలో స్టూడెంట్స్‌ ఎక్స్చేంజ్‌ ప్రోగ్రాం లో భాగంగా ఉమ్మడి కష్ణా జిల్లాలో మూడు రోజులు చారిత్రక ప్రదేశాలు తిలకించేందుకు విచ్చేశారు. ఈ సందర్భంగా బుధవారం కష్ణా జిల్లా కూచిపూడి లో కూచిపూడి నాట్యాన్ని తిలకించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వేదాంతం రామలింగ శాస్త్రి ద్వారా నాటి నేటి నాట్యాచార్యుల జీవిత సంగ్రహాలను సేకరించారు. అలాగే ఎం పి ఏ విద్యార్థుల నాట్య ప్రదర్శనలను తిలకించారు. నాట్య అధ్యాపకులు డాక్టర్‌ ఏలేశ్వరపుశ్రీనివాసులు ఆధ్వర్యంలో విద్యార్థినిలు పలు అంశాలు ప్రదర్శించగా మదంగంపై పసుమర్తి హరినాధ శాస్త్రి సహకరించారు. ఈ సందర్భంగా వారు భారతదేశంలో గల కళలను గూర్చి తెలుసుకొని కూచిపూడి నాట్య విశిష్టతను కొనియాడారు. వీరందరూ కళాపీఠంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవం వేడుకలలో సైతం పాల్గొన్నారు.