Nov 26,2022 23:40

జ్యోతి వెలిగించి ఫ్రెషర్స్‌ డే వేడుకలు ప్రారంభిస్తున్న జివిఎంసి కమిషనర్‌ రాజాబాబు

ప్రజాశక్తి -తగరపువలస : కఠోర శ్రమ ద్వారానే లక్ష్యాన్ని సాధించగలమని అవంతి విద్యా సంస్థల అధినేత, భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు విద్యార్థులకు సూచించారు. స్థానిక అవంతి ఇంజినీరింగ్‌ కళాశాలలో ఇంజినీరింగ్‌ విద్యార్థుల ప్రెషర్స్‌ డే వేడుకలు శనివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ముత్తంశెట్టి మాట్లాడుతూ, ఎంచుకున్న లక్ష్యం ఉన్నతంగా ఉండాలన్నారు. మన చుట్టూరా ఉన్న అపారమైన వనరులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గౌరవ అతిథిగా పాల్గొన్న జివిఎంసి కమిషనర్‌ పి.రాజాబాబు మాట్లాడుతూ, ఎంచుకున్న సబ్జెక్ట్‌లో పట్టు సాధించడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్నారు. మరో గౌరవ అతిథి జెఎన్‌టియు, విజయనగరం, గురజాడ విశ్వ విద్యాలయం రిజిస్ట్రార్‌ డాక్టర్‌ స్వామినాయుడు మాట్లాడుతూ, రోజు రోజుకూ అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని కోరారు.జోనల్‌ కమిషనర్‌ ఎస్‌.వెంకటరమణ, కళాశాల ఎఒ సంతోష్‌, డైరెక్టర్‌ చంద్రశేఖర్‌, పలువులు ప్రిన్సిపల్స్‌ పాల్గొన్నారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి సర్టిఫికెట్లు అందజేశారు. ముందుగా జివిఎంసి కమిషనర్‌ రాజాబాబు జ్యోతి వెలిగించి ఫ్రెషర్స్‌ డే వేడుకలు ప్రారంభించారు.