May 13,2023 01:21
పుస్తక పఠనం చేస్తున్న చిన్నారులు

ప్రజాశాక్తి-చీరాల: పుస్తక పఠనంతో విద్యార్థులకు మేధస్సు లభిస్తుందని, తద్వారా వారికి ప్రపంచంలో జరిగే అన్ని విషయాలపై అవగాహన కలిగి ఉంటారు అని రిసోర్స్‌ పర్సన్‌ ఎం కృష్ణ మోహన్‌ అన్నారు. వేసవి శిక్షణా తగతులలో భాగంగా చీరాల శాఖా గ్రంథాలయంలో జనరల్‌ నాలెడ్జ్‌, పొడుపు కథలు రాసే విధానం, తెలుగు భాషపై పట్టు తదితర అంశాల గురించి విద్యార్థులకు వివరించారు. అనంతరం పిల్లలకు లోడో క్యారమ్స్‌ చెస్‌ కాంపిటీషన్‌ నిర్వహించి విజేతులైన విద్యార్థులకు ఆదివారం బహుమతులు ఇవ్వనున్నట్లు గ్రంథపాలకురాలు డి ధనమ్మ తెలిపారు.