Feb 13,2023 18:03

ప్రచారంలో ప్రజాసంఘాలు

కత్తి నరసింహారెడ్డి, పోతుల నాగరాజులను మొదటి ప్రాధాన్యత వేయండి
ప్రజా సంఘాలు

ప్రజాశక్తి - కొత్తపల్లి

పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ, పట్టుబద్రుల శాసన మండలి స్థానాలకు పోటీ చేస్తున్న కత్తి నరసింహారెడ్డి, పోతుల నాగరాజులకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎన్‌ స్వాములు, సిఐటియు జిల్లా నాయకులు ఏ రణధీర్‌, బి రామ్‌ నాయక్‌, గిరిజన సంఘం జిల్లా నాయకులు నరసింహ నాయక్‌ కోరారు. సోమవారం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కొత్తపల్లి మండలంలోని దుద్యాల, నందికుంట, కొత్తపల్లి, శివపురం, ముసలమడుగు, గోకవరం పాఠశాలల్లో ప్రచారం నిర్వహిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోతుల నాగరాజు కత్తి నరసింహారెడ్డిలు విద్యార్థి ఉద్యమాల్లో సామాజిక ఉద్యమాల్లో పాల్గొంటూ నిత్యం ప్రజా సమస్యలపై పోరాటాలు నిర్వహించిన చరిత్ర ఉందన్నారు. ఉద్యోగులు కార్మికులు కర్షకులు ఎదుర్కొంటున్న సమస్యలను శాసన మండలిలో ప్రస్తావించడం జరుగుతుందన్నారు. పిడిఎఫ్‌ ఎమ్మెల్సీల సహకారంతో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాల అండదండలతో పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ పట్టుభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ చేస్తున్న కత్తి నరసింహారెడ్డి, పోతుల నాగరాజులను ఉద్యోగ, ఉపాధ్యాయ పట్టభద్రులు, మేధావులు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించి శాసనమండలి పంపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.