క్షయవ్యాధి, వడ దెబ్బపై అవగాహన
ప్రజాశక్తి - కొత్తపల్లి
కొత్తపల్లి మండలం నాగంపల్లి గ్రామ లో ఉపాధి హామీ కూలీలకు క్షయవ్యాధి మరియు వడ దెబ్బ గూర్చి టిబి సూపర్వైజర్ చెరుకు రవికుమార్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్షయ వ్యాధి లక్షణాలు, నివారణ చర్యలు, వ్యాధిని గుర్తించే పరీక్షలు, వ్యాధి నిర్దారణ అనంతరం చికిత్స కాలం గూర్చి వివరించారు.పొగాకు సిగరెట్టు,మద్యపానం వ్యసనాలు ఉన్నవారికి క్షయవ్యాది సోకె అవకాశం ఉంది అని సూచించారు. హెల్త్ ఎడ్యుకేటర్ మద్దిలేటి మాట్లాడుతూ వడదెబ్బ తగల కుండ నీరు,పళ్ళ రసాలు, కొబ్బరినీళ్లు, మజ్జిగ ద్రవ పదార్థాలు తీసుకోవాలి, నలుపు,మందంగా ఉండేవాటికి బదులు లేత రంగుల్లో లభించే తేలికైన కాటన్ దుస్తులు ధరించాలని, కనీసం 15 లీటర్ల నీరు త్రాగాలి,తలకు ఎండ తగలకుండా గోడుగును లేదా టోపి ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ రాజగోపాల్ మరియు మేటి కూలీలు పాల్గొన్నారు.










