ర్యాలీ చేపడుతున్న విద్యార్థులు
ప్రజాశక్తి-మాకవరపాలెం:క్షయ వ్యాధిని నిర్మూలించాలని స్థానిక హైస్కూల్ నుంచి బస్టాం డ్ వరకూ విద్యార్థులు క్షయ వ్యాధిపై ర్యాలీ నిర్వ హించారు. క్షయ వ్యాధిపై నినాదాలు చేశారు. అనంతరం వైద్యాధికారి సీతమహాలక్ష్మి మాట్లాడుతూ, క్షయ వ్యాధిని ప్రాధమిక స్థాయిలో గుర్తిస్తే నయం చేయవచ్చునన్నారు. దీని పై గ్రామ స్థాయిలో ఎప్పటి కప్పుడు సిబ్బంది సర్వే చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.










