ర్యాలీ చేపడుతున్న వైద్య సిబ్బంది
ప్రజాశక్తి-హుకుంపేట: టిబి వారోత్సవాల్లో భాగంగా మండలంలోని ఉప్ప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి ఉప్ప జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. క్షయ వ్యాధి ని నిర్మూలిద్దాం దేశాన్ని కాపాడుదాం అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎంఓటీసి టిబి వైద్య అధికారి అనూష మాట్లాడుతూ, క్షయ వ్యాధిని అంత మొందించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. గతంలో కన్నా టీబి పై అవగాహన కల్పించడంతో గ్రామాల్లో తగ్గుముఖం పట్టిందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిహెచ్‌ఒ సన్యాసిరావు, హెల్త్ సూపర్వైజర్ మోహన్‌రావు పాల్గొన్నారు.










