ప్రజాశక్తి -యంత్రాంగం
క్షయ వ్యాధి నివారణపై నగరంలో బుధవారం పలుచోట్ల అవగాహన ర్యాలీలు నిర్వహించారు.
భీమునిపట్నం : స్థానిక సిహెచ్‌సి, పిహెచ్‌సి, యుపిహెచ్‌సి పరిధిలో అవగాహన ర్యాలీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయా ఆసుపత్రుల వైద్యాధికారులు సిహెచ్.కనకదుర్గ, డి.సిద్ధార్థకుమార్, బి.మల్లికార్జునరావు, స్వప్న, అఖిల, సుస్మిత, సిబ్బంది పాల్గొన్నారు.
మధురవాడ : జిల్లా క్షయ నివారణాధికారి డాక్టర్ పూర్ణేంద్రబాబు ఆదేశాల మేరకు మధురవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో నర్సింగ్ విద్యార్థులు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. టిబి ఓడి పోవాలి..., దేశం గెలవాలి..., చుట్ట, బీడీ, సిగరెట్టు టీబీ జబ్బుకు తొలి మెట్టు..., కళ్లె పరీక్ష చేసుకో క్షయని నిర్ధారించుకో..., టీబీ పరీక్షలు, మందులు పూర్తిగా ఉచితం... అంటూ ర్యాలీలో నినదించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ దీపిక, సిహెచ్‌ఒ ఎస్.సౌభాగ్యమణి, హెచ్‌ఎస్ రమణ, ఎస్‌టిఎస్ సురేష్, ఎస్‌టిఎల్‌ఎస్ వీరబ్రహ్మం, టీబీ యూనిట్ సిబ్బంది పాల్గొన్నారు.
ఆనందపురం : ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యాన బోయపాలెం, లొడగలవానిపాలెంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ కోరాడ శైలజ మాట్లాడుతూ, దగ్గు ఎక్కువగా ఉంటే పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సామాజిక ఆరోగ్య అధికారి పి.సాంబమూర్తి, బోయపాలెం స్కూల్ ప్రధానోపాధ్యాయులు వైవి.రావు, రమణ, సిహెచ్‌ఒ ఎన్.సాయి గౌతమి, ఎస్.సురేష్ కుమార్, అరుణ కుమార్, విద్యార్థులు, లోడగలవారిపాలెంలో జరిగిన కార్యక్రమంలో డాక్టర్ శాహనజ్, హెల్త్ సూపర్‌వైజర్ ఐ.గోవిందరావు.సెక్రటరీ అనురాధ, సిహెచ్‌ఒ అరుణ, హెల్త్ అసిస్టెంట్ తారకేష్, ఆశా కార్యకర్తలు మంగ, పాపయమ్మ పాల్గొన్నారు.
ఆరిలోవ : జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆధ్వర్యాన ఆరిలోవలో ర్యాలీ నిర్వహించారు. ఆరిలోవ కాలనీ చివరి బస్టాపు వద్ద గల రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద మానవహారం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా డిఎంహెచ్‌ఒ డాక్టర్ జగదీశ్వరరావు, మాట్లాడుతూ, క్షయ వ్యాధిపై క్షేత్రస్థాయిలో అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కెళ్ల పరీక్ష, ఎక్సరే, సిబిఎన్‌ఎఎటి, ఆర్‌టిపిసిఆర్ పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. క్షయ రోగులకు ఉచితంగా మందులతో పాటు చికిత్స సమయంలో పోషకాహారం కోసం నెలకు రూ.500 ఆర్థికసాయం చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిటిసిఒ డాక్టర్ పూర్ణేంద్రబాబు, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుమన్ చంద్ర, యుపిహెచ్‌సి, ఆరిలోవ జివిఎంసి ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.
ప్రజాశక్తి-యస్.రాయవరం: ప్రపంచ క్షయ వ్యాధి నిర్మూలన దినోత్సవం సందర్బంగా మండలంలోని పెనుగొల్లు ప్రాధమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు రామ్ నాయక్, సూపర్వైజర్ అభిలాష్, ఆదినారాయణరావు ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.










