టీబీ రోగులకు ఫౌష్టికాహార సరుకులు అందిస్తున్న వైద్య సిబ్బంది
ప్రజాశక్తి-మధురవాడ : మధురవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 23 మంది క్షయ రోగులకు అరబిందో ఫార్మా కంపెనీ సమకూర్చిన పౌష్టికాహారాన్ని మంగళవారం ఆసుపత్రి టీబీ యూనిట్ సిబ్బంది అందించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి ప్రశాంతి మాట్లాడుతూ, జిల్లాలో 450 మంది క్షయ రోగులను అరబిందో కంపెనీ దత్తత తీసుకుందని తెలిపారు. వారికి ఒక్కొక్కరికి రూ.700 విలువైన సరుకులను అందించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సిహెచ్‌ఒ సౌభాగ్య మణి, టీబీ యూనిట్ సూపర్‌వైజర్ వి.వీరబ్రహ్మం, సిబ్బంది గోపి, అరుణ్‌కుమార్, అనూష, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.










