ప్రజాశక్తి- అనకాపల్లి
ప్రధానమంత్రి టీవీ ముక్త భారత్ అభియాన్ పథకానికి విరాళాలు ఇచ్చి క్షయ రోగులను ఆదుకోవాలని కలెక్టర్ రవి పఠాన్ శెట్టి కోరారు. స్థానిక ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రిలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో పాల్గొని 40 మందికి పౌష్టికాహారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా 476 మంది టిబి రోగులను దత్తత తీసుకున్న హెటిరో ఫౌండేషన్ యాజమాన్యాన్ని అభినందించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఏ హేమంత్ మాట్లాడుతూ టీవీ రోగులను దత్తత తీసుకునేందుకు అధికారులు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలన్నారు. హెటిరో ఫౌండేషన్ రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం చెక్కును కలెక్టర్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిసిహెచ్‌ఎస్ డాక్టర్ శ్రావణ్ కుమార్, హెటిరో సంస్థ ప్రతినిధులు పుల్లారెడ్డి, సుబ్బారెడ్డి, టిబి మెడికల్ ఆఫీసర్ కష్ణ కుమార్, డిఐఓ మురళీధర్, ఐఎంఏ డాక్టర్లు బెనర్జీ, గుప్తా తదితరులు పాల్గొన్నారు.










