
ప్రజాశక్తి - నిడదవోలు స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలోని క్షయ, ఎఆర్‌టి సెంటర్లను ల్లా లెప్రసీ ఎయిడ్స్ అండ్ టిబి కంట్రోల్ ఆఫీసర్ డాక్టర్ ఎన్.వసుంధర బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో క్షయ వ్యాధి నిర్ధారణకు జరుగు కళ్ళే పరీక్షలు, ల్యాబ్ పరీక్షలు, టిబి చికిత్స రికార్డులు, వ్యాధిగ్రస్తులకు అందజేస్తున్న మందులను పరిశీలించారు, అనంతరం క్షయ వ్యాధిగ్రస్తుల ఇండ్లకు క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లి సిబ్బంది అందిస్తున్న చికిత్స విధానం, మందులు వివరాలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా హెచ్‌ఐవికి సంబంధించిన రికార్డులను పరిశీలించి సిబ్బంది పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిహెచ్‌సి సూపరింటెండెంట్ డాక్టర్ ఎవిఆర్‌ఎస్ తాతారావు, ఎంపి హెచ్‌ఎస్.వీర్రాజు, ఎస్‌టిఎల్‌ఎస్.భీమరాజు, రత్నకుమారి, ఎల్‌టి.రాజ్ కుమార్, ఐసిటిసి కౌన్సిలర్ గ్రేసీ ప్రమోదకుమారి, డిపిఎం ఒ.మోషే, తదితరులు పాల్గొన్నారు.