Sep 09,2023 20:02

సత్కరిస్తున్న ఎంఎల్‌సి

ప్రజాశక్తి-నెల్లూరు :స్థానిక కస్తూరిబా కళాక్షేత్రంలో విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ ప్రవీణ్‌ ప్రకాష్‌ ఆధ్వర్యంలో శనివారం విద్యా సదస్సు జరిగింది. తొలేత టోఫెల్‌ పరీక్షకు సంబంధించిన విషయాలను ఆయన విద్యార్థులు ఉపాధ్యాయులకు వివరించారు. విద్యార్థులకు బైజూస్‌ టాబ్‌లు వినియోగించాలన్నారు. యూట్యూబ్‌లోనూ చాలా వీడియోలు ఉంటాయన్నారు. ప్రతీ చాప్టర్‌లో ఎన్నో స్థాయిలలో ప్రశ్నలు అందుబాటులో ఉంటాయన్నారు. విద్యార్ధులు అన్నిటింటిని పరిచయం చేయాలని సూచించారు. అనంతరం బైజుస్‌ కంటెంట్‌,డిజిటల్‌ తరగతుల పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. పలు అంశాలపై విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ప్రవీణ్‌ ప్రకాష్‌ సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఎంఎల్‌సి పర్వత రెడ్డి చంద్రశేఖర్‌ రెడ్డి మాట్లాడుతూ విద్యా సదస్సు విజయమైనందుకు సంతోషంగా ఉందన్నారు. ప్రవీణ్‌ ప్రకాష్‌ చెప్పిన ప్రతి విషయాన్ని విద్యార్థులు అర్థం చేసుకుని సాంకేతిక బోధనను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం నాడు- నేడు ద్వారా విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు.