బ్రహ్మంగారిమఠం : బి.మఠం కస్తూరిభా విద్యార్థి అస్వస్థత ఘటనలో బాధ్య ఉద్యోగులను వదిలేసి కిందిస్థాయి వర్కర్లను బాధ్యులుగా చేయడంపై విమ ర్శల వర్షం కురుస్తోంది. గత జులై 23న కస్తూరిభా పాఠశాలలో ఏడవ తగరతి చదువుతున్న బి.మఠం మండలం లోని బాలాయపల్లి చెందిన విద్యార్థిని రాత్రి వేళ అస్వస్థతకు గురైన ఘటన తెలిసిందే. ఆ ఘటనలో ఆశించిన వేగంగా అధికారులు స్పందించక పోవ డంపై చర్యలు తీసుకోవడం అభినందనీయం. కానీ బాధ్యత కలిగిన అధికారులపై చర్యలు తీసుకో కపోవడంలోని మతలబేమిటో తెలియడం లేదు. కస్తూరిభా పాఠశాల పర్యవేక్షణలో ఎస్‌ఒ, పిఇటి, రాత్రివేళ ఉపాధ్యాయుడు ప్రధాన బాధ్యులు. ఇటు వంటి ప్రధాన బాధ్యులను ఉద్దేశపూర్వకంగా వదిలేసి కింది స్థాయికి చెందిన తాత్కాలిక వర్కర్లు వాచ్‌మెన్, వంటమనిషి, ఇద్దరు స్వీపర్లు, అటెం డర్లను సస్పెన్షన్ చేయడంలోని హేతుబద్దత ప్రశ్నా ర్థకంగా మారింది. ప్రధాన బాధ్యులైన ఉద్యో గులను ఉద్దేశపూర్వకంగా వదిలేసి కింది స్థాయిలో పనిచేసే తాత్కాలిక వర్కర్లపై చర్యలు తీసు కోవడంలోని ఔచిత్య మేమిటనే వాదన వినిపి స్తోంది. ప్రధాన బా ద్యులైన ఉద్యోగులను ఎస్‌ఎస్‌ఎకు చెందిన జిల్లా ప్రధాన బాధ్య అధికారే కాపా డుతున్నారనే విమర్శ పెద్దఎత్తున వినిపిస్తోంది. ఇందులో నిజానిజాలు ఎలా ఉన్నా బాధ్యత కలిగిన ఎస్‌ఒ, పిఇటి, టీచర్లను వదిలేయడం వెనుక మతలబేమిటో తెలియాల్సి ఉందనే డిమాండ్ వినిపి స్తోంది. కింది స్థాయి ఉద్యో గులను సస్పెన్షన్ తోపాటు టెర్మినేషన్ చేయాలనే తీవ్ర ఆలోచనల్లో 50 శాతం చర్యలు కూడా బాధ్యత కలిగిన ముగ్గురు అధికారులపై లేకపోవడం సందే హాలకు తావిస్తోంది. విద్యార్థి అస్వస్థత-ఐదుగురు ఉద్యోగుల సస్పెన్షన్ చేసిన ఘటనలో ఎస్‌ఎస్‌ఎ జిల్లా ఉన్న తాధికారి నిజాయతీ ప్రశ్నార్థకంగా మారి ంది. ఎస్‌ఎస్‌ఎ లోని ఉద్యోగులకు ఒక న్యాయం, వర్కర్లకు మరో న్యాయమా అని నిలదీస్తున్న వైనం విస్మ యాన్ని కలిగిస్తోంది. ఇదిలాఉండగా పూర్తి స్థాయి బాధ్యతలు కలిగిన ఉద్యోగులపై పక్షపాతం చూప డం వెనుక మతలబుపై నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలనే డిమాండ్ వినిపిస్తోంది.










