ప్రజాశక్తి-బాపట్ల: పాలిటెక్నిక్ కష్టపడి జీవితంలో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా ఎదిగి సమాజ అభివృద్ధి తోడ్పడాలని కుమార్ పంప్స్ మేనేజింగ్ డైరెక్టర్ కొత్త సుబ్రహ్మణ్యం అన్నారు. శనివారం బాపట్ల పాలిటెక్నిక్ కళాశాల వార్షికోత్సవ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఇష్టంతో చదివి చరిత్రలో గొప్ప వ్యక్తులను ఆదర్శంగా తీసుకుని జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలని కోరారు. బాపట్ల ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షులు ముప్పలనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులు పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన సహకారాన్ని అందించడానికి బాపట్ల ఎడ్యుకేషనల్ సొసైటీ ముందుంటుందన్నారు. పాలిటెక్నిక్ విద్యలో ఉత్తమ ప్రతిభా కనబరిచిన విద్యార్థులకు ప్రశంసపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో సొసైటీ కార్యదర్శి మానం నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు దొప్పలపూడి రామ్మోహన్‌రావు, గెల్లి దిలీప్ కుమార్, ప్రిన్సిపాల్ టి రాజేంద్రప్రసాద్, సంయుక్త కార్యదర్శి కొమ్మినేని హరి పద్మ ప్రసాద్, కోశాధికారి టి రామకృష్ణ, అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.










