Jul 20,2022 00:33

మాట్లాడుతున్న శ్రీభరత్‌

   ప్రజాశక్తి -భీమునిపట్నం : పార్టీ అభివృద్ధి కోసం కష్టపడి పనిచేసే వారికి టిడిపిలో గుర్తింపు ఉంటుందని ఆ పార్టీ విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త ఎం.శ్రీభరత్‌ స్పష్టం చేశారు. పార్టీ నియోజక వర్గ విస్తృత స్థాయి సమావేశం మంగళవారం బ్యాంక్‌ కాలనీలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా శ్రీ భరత్‌ హాజరై మాట్లాడారు. వైసిపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పార్టీ అధిష్టానం ఇచ్చిన ప్రతి పిలుపునకు స్పందించి భీమిలి నియోజకవర్గంలో ఆందోళనా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. సాధారణ ఎన్నికల వరకూ ఇదే స్ఫూర్తితో పనిచేయాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తు టిడిపిదేనన్నారు. పార్టీ నియోజక వర్గ ఇన్‌ఛార్జి కోరాడ రాజబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కార్పొరేటర్‌ ఎం.హేమలత, పార్టీ నాయకులు డిఎఎన్‌ రాజు, జి.ఆనందబాబు, కె.దామోదరరావు, పాసి నరసింగరావు, గంటా నూకరాజు, తమ్మిన సూరిబాబు, యరబాల అనీల్‌ ప్రసాద్‌, పిట్ట సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.