Jan 02,2023 23:55

మాట్లాడుతున్న ఈశ్వరి

ప్రజాశక్తి-పాడేరు టౌన్‌: తెలుగుదేశం పార్టీ నాయకులు ఓటరు వెరిఫికేషన్‌ ను వేగవంతం చేయాలని టిడిపి పాడేరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్‌, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. సోమవారం ఆమె నివాసగృహం కుమ్మరిపుట్టులో పాడేరు, చింతపల్లి మండలాలకు చెందిన క్లస్టర్‌, యూనిట్‌ ఇన్చార్జిలు, బూత్‌ కమిటీలు, సేవామిత్ర సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఓటరు వెరిఫికేషన్‌ ప్రతీ ఒక్కరూ చేయించు కోవాలన్నారు. అర్హులైన కొత్త ఓటర్లను నమోదు చేయించాలన్నారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టిడిపిని గెలిపిం చేందుకు మనమంతా సిద్ధంగా ఉండాలన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి మంచి గుర్తింపు ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరే క విధానాలను ప్రజలకు వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సెల్‌ రాష్ట్ర ఉపాధ్యకులు పోలుపర్తి గోవిందరావు, రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి కోడా వెంకట సురేష్‌ కుమార్‌, ఐటిడిపి నియోజక వర్గ అధ్యక్షులు బుద్ధ జ్యోతి కిరణ్‌, చింతపల్లి మండలాధ్యక్షులు కిల్లో పూర్ణచందర రావు, పాడేరు, చింతపల్లి క్లస్టర్‌ ఇన్చార్డు డప్పోడి వెంకటరమణ, పాంగి రాము, వంతాల భీమన్న, యూనిట్‌ ఇంచార్జ్‌ లు, బూత్‌ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.