ప్రజాశక్తి- బూర్జ: మండలంలో అన్నంపేట గ్రామానికి చెందిన ఆచంట ఉమామహేశ్వరరావుకు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో కుడికాలు విరిగిపోయింది. దీంతో ఆయన ఏ పని చేయలేక ఇంటికి పరిమితమై ఇబ్బందులకు గురవుతున్న తరుణంలో అదే గ్రామానికి చెందిన స్నేహితులందరూ ఒక్కటై కాలుపోయి బాధపడుతున్న క్షతగాత్రుడు ఉమామహేశ్వరరావు ఇంటికి వెళ్లి ఆదివారం పరామర్శించారు. నీకు మేమున్నాము అంటూ భరోసా ఇచ్చారు. రూ. 11,700 ఆర్థికసాయాన్ని అందజేశారు. కష్ట కాలంలో కలిసి చదువుకున్న మిత్రులు సాయం అందించి ఆదుకునే ఉదార స్వభావం గొప్పదని స్థానికులు అభినందించారు.