Oct 30,2023 20:50

క్షతగాత్రులను పరామర్శిస్తున్న టిడిపి నాయకులు

ప్రజాశక్తి- విజయనగరం కోట : రైలు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను జిల్లా సర్వజన ఆస్పత్రిలో టిడిపి నాయకులు సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తక్షణ సహాయం కింది ప్రతి ఒక్కరికీ రూ. 50వేలు నగదు, రూ.9.50లక్షల చెక్కును అందించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సిఎం వచ్చినప్పటికీ ఇంకా ఎక్స్‌గ్రేషియా చెల్లించకపోవడం దారుణమన్నారు. క్షతగాత్రులను వెంటనే మెరుగైన వైద్యం కోసం కార్పొరేట్‌ ఆస్పత్రులకు తరలించాలని డిమాండ్‌ చేశారు. మెట్టవలస, ఎస్‌పి రామచంద్రపురం, జి.సిగడాం గ్రామాలకు చెందిన క్షతగాత్రులను ఎచ్చెర్ల నియోజకవర్గం టిడిపి నాయకులు కలిశెట్టి అప్పలనాయుడు పరామర్శించారు. జనసేన నాయకులు గురాన అయ్యలు క్షతగాత్రులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు కళా వెంకట్రావు, కోండ్రు మురళీ, మాజీ ఎమ్మెల్యేలు కోళ్ల లలిత కుమారి, కొండపల్లి అప్పలనాయుడు, జిల్లా పార్లమెంట్‌ అధ్యక్షులు కిమిడి నాగార్జున, నెల్లిమర్ల ఇంచార్జ్‌ కర్రోతు బంగార్రాజు, తదితరులు పాల్గొన్నారు.