ఆస్పత్రిలో పరామర్శిస్తున్న దృశ్యం
క్షతగాత్రులకు పరామర్శ
ప్రజాశక్తి-ఉదయగిరి:బస్సు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రుల వివరాలను అడిగి తెలుసుకుంటున్న సిఐ గిరిబాబు. గురువారం ఉదయం సిఐ. వి. గిరిబాబు, ఎస్ ఐ.కే.ఇంద్రసేనారెడ్డిలు క్షతగాత్రులను పరామర్శించి ప్రమాదగ్గల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఉదయగిరి ఆర్టీసీ డిపోకు చెందిన బెంగుళూరు -ఉదయగిరి బస్సు బెంగళూరు నుండి ఉదయగిరి కి వస్తుండగా పిపి కుంట సమీపంలో ముందు వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్‌ను ఢకొీని ఈ ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. ఈ ఘటనలో సీతారామపురం మండలం, రంగనాయడు పల్లి గ్రామానికి చెందిన దుద్దిపోగు శోభకు,ఉదయగిరి బీసీ కాలనీకి చెందిన అచ్చమ్మ, తిరుపతమ్మలకు, దండుపాలెంకు చెందిన ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల వివరాల మేరకు తెల్లవారుజామున ఈ సంఘటన జరగడంతో బస్సులో ఉండే ప్రయాణికులు బెంబేలెత్తి పోయారు. ఈ సంఘటన జరిగిన వెంటనే 108 నందిపాడు వరకు బస్సు ఉదయగిరి కి ఆటో సహాయంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలి వచ్చామని బాధితులు పేర్కొన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.










