Feb 08,2023 23:29

క్షతగాత్రులను పరామర్శిస్తున్న డిఎంహెచ్‌ఒ

ప్రజాశక్తి-పాడేరు టౌన్‌: అల్లూరి జిల్లా పెదబయలు మండలం గలగండ గ్రామం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన 5 మందిని హుటాహుటిన 108 వాహనంలో జిల్లా జిల్లా ఆసుపత్రికి తరలించి తరలించి వైద్య సేవలందిస్తున్నామని డిఎం అండ్‌ హెచ్‌ఒ సి.జమాల్‌ భాషా తెలిపారు. బుధవారం జిల్లా ఆసుపత్రిలో బాధితులని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అత్యవసర, మెరుగైన వైద్యం వైద్య సేవల కోసం విశాఖ కెజిహెచ్‌ కు తరలించాలని సూపరింటెండెంట్‌ కె.కృష్ణారావును ఆదేశించారు. అనంతరం డయాల్సిస్‌ సెంటర్‌ను సందర్శించి రికార్డులను పరిశీలించారు. వైద్య సేవలను, రోజువారి కేసుల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి ప్రసూతి విభాగం పై భాగంలో ఉన్న మరుగుదొడ్ల వద్ద ఆడ శిశువును వదిలి వెళ్లిన సంఘటనను తెలుసుకుని శిశువు ఆరోగ్య పరిస్దితిని వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. శిశువు ఆరోగ్య పరిస్థితి మెరుగు పడ్డాక శిశు సంరక్షణకు శిశు సంక్షేమ శాఖ అధికారికి అప్పజెప్పాలని ఆదేశించారు. ఆయన వెంట ఎడిఎంహెచ్‌ఒ కె.లీలాప్రసాద్‌, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డా.కె.కృష్ణారావు, ఎపిడమిక్‌ సెల్‌ ఆరోగ్య విస్తరణ అధికారి జి.సింహాద్రి, జిల్లా టిబి పర్యవేక్షకులు వి.కిరణ్‌, వైద్య సిబ్బంది పాల్గున్నారు.