May 25,2023 23:32

మంగళగిరి: సీఆర్డీఏ పరిధి నిడమర్రు ఆర్‌-5 జోన్‌ లేఅవుట్‌ అభివృద్ధి పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు ఇటీవల గాయపడి నగరం లోని ఎయిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రు లను గురువారం ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి , ఎమ్మెల్సి మురు గుడు హనుమంతరావు, ఆప్కో చైర్మన్‌ గంజి చిరంజీవిలు పరా మర్శించారు. ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డ నలుగురికి ఒక్కొక్కరికీ రూ.25 వేలను, తీవ్రంగా గాయపడిన ఒకరికి రూ. 50 వేల ఆర్థిక సహాయాన్ని తన వంతుగా ఎమ్మెల్యే అంద జేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ ప్రమాద ఘటన జరిగిన సమయంలో తాను విదేశీ పర్యటనలో ఉన్నా నని, ఈ నేపథ్యంలో ఎయిమ్స్‌ ఆసు పత్రిలో చికిత్స పొందున్న ఐదుగురి కార్మికులను పరామర్శించినట్లు చెప్పారు. చికిత్స పొం దుతున్న కార్మి కులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఎయిమ్స్‌ సూపరింటెండెంట్‌ కు సూచించి నటు, చికిత్స పొందు తున్న వారిని వారం రోజుల్లో డిశ్చార్జి చేయనున్నట్లు చెప్పారు.