Feb 13,2022 11:01

ధామము శిథిలమై
ధరణి చెంతయై
దేహము శల్యమై
చేతనం ఛిద్రమై
బతుకు బరువై
వెతలు తరువై
దుఃఖము చేరువై
సుఖము దూరమై
కునుకు కరువై
కన్నీరు ఎరువై

ఎవరికోసం....
ఆ ఎదురుచూపులు!!
ఎందుకోసం ....
ఆ చెదరని నిరీక్షణలు!!
సేద తీరేందుకు
చూస్తున్నాయి ఆ కన్నులు!!
ఆకలి తీరేందుకు
అర్థిస్తున్నాయి ఆ చేతులు!!
దాతలు కోసం
పరితపిస్తున్నాయి ఆ మూగ భాషలు!!!
 

చంద్రశేఖర్‌ డోకి
90309 83871