
ప్రజాశక్తి - ఆగిరిపల్లి
వికలాంగులకు కృత్రిమ అవయవాలు అమర్చడం ద్వారా ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని, యూనివర్శిటీ గ్రాంట్స్ కమీషన్(యుజిసి) మాజీ సభ్యులు, విజ్ఞాన్ యూనివర్శిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కె.రామమూర్తి నాయుడు తెలిపారు. మండల పరిధిలోని హీల్-ఎలిజబెత్ ఫాంటన్ లెగసీ ఆఫ్ హాప్ కృత్రిమ అవయవ కేంద్రలో ఆదివారం ఐదుగురు వికలాంగులకు కృత్రిమ అవయవాలను ఆయన అందజేశారు. ఈ కార్యక్రమంలో హీల్ సంస్థ అమెరికా ప్రతినిధి కారలిన్ జార్జి, హీల్ సంస్థ లండన్ ప్రతినిధి జూలీ కాన్సాన్స్, హీల్ వ్యవస్థాపక అధ్యక్షులు కె.సత్యప్రసాద్, సిఇఒ కె.అజరుకుమార్, ప్రిన్సిపల్ బి.సాయిబాబు, సీనియర్ టెక్నీషియన్ కె.చిన్నాలు పాల్గొన్నారు.