May 24,2023 23:55

మంగళగిరి రూరల్‌: రాజధాని ప్రాంతంలోని కృష్ణాయ పాలెం ఇళ్ల స్థలాల లేఅవుట్‌ ను గుంటూరు జిల్లా కలెక్టర్‌ వేణుగోపాల్‌ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే ఆర్కే బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లా డుతూ పేదోడు గొప్పవాడు కావాలని ఆకాంక్షించిన ప్రభుత్వం ముందుకు వెళుతోందని అన్నారు. ఎవరు ఎన్ని కుయు క్తులు పన్నినా అంతిమ విజయం పేదవాడి వైపే నిలిచిందని, ఇళ్ల పట్టాల పంపిణీకి చిక్కులు తొలగిపోయాయని అన్నారు. రాష్ట్రం మొత్తం రెండు సంవత్సరాల క్రితమే ఇళ్ల స్థలాలను పంపిణీ చేయగా ప్రతిపక్షాల కుట్రలతో ఈ ప్రాంతంలో ఆలస్యమైందని, ముఖ్యమంత్రి కృషి ఫలితంగా ఈ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరగనున్నట్లు చెప్పారు. మంగళగిరి - విజయవాడ నగరాలకు అతి సమీప ప్రాంతమైన ఇక్కడ ఒక పక్క నేషనల్‌ హైవే బైపాస్‌ రోడ్డు మరో పక్క కృష్ణా నదిపైవంతెన నిర్మాణం జరగనుండడంతో ఈ ప్రాంతం బంగారు మయంగా మారనుందని అన్నారు. ఈ ప్రాంతంలో ఇళ్ల నిర్మాణ పను లను అది óకారులు వేగవంతం చేసేలా చర్యలు తీసు కుంటామని చెప్పారు. కార్యక్రమంలో మంగళగిరి-తాడేపల్లి నగర పాలక సంస్థ కమిషనర్‌, సిఆర్‌డిఎ, రెవెన్యూ, ఇంజ నీరింగ్‌ విభాగ అధికారులు పాల్గొన్నారు.


టిడ్కో గృహాల పరిశీలన
తాడేపల్లి: పెనుమాకలో నిర్మించిన టిడ్కో ఇళ్ల సముదాయాన్ని బుధవారం స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎంటిఎంసి అధికారులతో కలిసి పరిశీలించారు. టిడ్కో ఇళ్లను లబ్దిదారులకు ఇవ్వడానికి అధి కారులు ఇటీవల లబ్దిదారుల జాబితాను విడుదల చేశారు. ఇళ్లల్లో కొద్దిపాటి మరమ్మతులను కూడా చేయించారు. ఈ నెల 26న జరగనున్న సిఎం సభలో టిడ్కో ఇళ్లు లబ్దిదారులకు పత్రాలిచ్చి గృహ ప్రవేశాలు చేయించే అవకాశం ఉంది. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ ఎం.వేణుగోపాల రెడ్డి, తాడేపల్లి తహశీల్దార్‌ నాగిరెడ్డి, ఎంటిఎంసి కమిషనర్‌ శారదాదేవి, డిఇ కృష్ణారెడ్డి, ఎఇ కిషోర్‌రెడ్డి పాల్గొన్నారు.