తాడేపల్లి: ఉండవల్లి 1, 2 సచివాలయాల పరిధిలోని లబ్ధిదారులకు కృష్ణాయపాలెం లే అవుట్‌లో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సోమవారం ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదవారి సొంతింటి కల నెరవేరు తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. రాజధాని ప్రాంతంలో 57 వేల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తుంటే, మాజీ సిఎం చంద్రబాబు 'అన్యాయం, అక్రమం' అని గోల చేయడం సబబు కాదన్నారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు బుర్రముక్కు భాస్కరరెడ్డి, పిచ్చిరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.










