కమలాపురం ; కమలాపురం నగర పంచాయతీ పరిధిలోని రైల్వేగేటు సమీ పాన ఉన్న శ్రీ రాధాకష్ణ మందిరం ఏడవ వార్షికోత్సవం సంద ర్భంగా ఈనెల 7న నిర్వ హించబోయే కృష్ణాష్టమి వేడుకలను జయప్రదం చేయాలని టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు పుత్తానరసింహారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన ఆలయంలో నిర్వహిస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పుత్తా మాట్లాడుతూ వార్షికోత్సవంలో భాగంగా 7న ఉదయం 5.30 గంటలకు సుప్రభాతంతో వేడుకలు ప్రారంభమవుతాయన్నారు. గోపూజ, మూలమూర్తికి అభిషేకం, సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం, కుంకుమార్చన, నక్షత్ర కుంభహారతి, వేదస్వస్తి, తీర్థప్రసాద వినియోగం ఉంటాయన్నారు. అలాగే ఎద్దులచే బండలాగుడు పోటీలు, మహిళలకు ముగ్గులు పోటీలు, అల్లేం గుండు,ఉట్టి కోట్టె తదితర పోటీలు నిర్వహించి గెలుపొందిన విజేతలకు నగదు బహుమతి అందజేస్తామని చెప్పారు. .చిన్న పిల్లలతో శ్రీకష్ణ వేషధారణలను చేపట్టిన వారికి బహుమతులు అందజేస్తామన్నారు. విచ్చేసిన భక్తులకు మధ్యాహ్నం అన్నదానం ఉంటుందన్నారు. వార్షికోత్సవ వేడుకలలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు పొంది కార్యక్రమాన్ని జయప్ర దం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో వాసుదేవ రెడ్డి, దివాకర్ రెడ్డి, రాఘవరెడ్డి, మాజీ హాస్పిటల్ చైౖర్మెన్ జంపాల నరసింహారెడ్డి, శంకర్ రెడ్డి, మల్లేష్ రాయల్ పాల్గొన్నారు










