ప్రజాశక్తి- నందిగాం: మండలంలోని కవిటి అగ్రహారంలో కృష్ణాష్టమి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఉట్టికొట్టి సందడి చేశారు. ఈ వేడుకల్లో ప్రధాన ఘట్టమైన ఉట్టి కొట్టే కార్యక్రమంలో ఆయన యువకులతో కలిసి ఉట్టి కొట్టారు. ఆయన ఉట్టి కొడుతున్నప్పుడు స్థానికులు ఈలలతో కేరింతలు కొట్టారు. అంతకుముందు వివిధ క్రీడా పోటీలను నిర్వహించారు. పోటీలను ప్రారంభించిన ఆయన వెయిట్ లిఫ్టింగ్, సంగిడి రాళ్ల పోటీ, ఉలవలు బస్తా పోటీలో విజేతలకు నగదు పురష్కారాలను అందజేశారు. ఈ ప్రాంత ప్రజలకు ప్రాచీన కళల్లో ఎంతో నైపుణ్యత ఉందని, అందులో భాగంగానే నాటి కోడి రామ్మూర్తి వెయిట్ లిప్టింగ్‌నకు ఆద్యుడయ్యాడని అన్నారు. ఈ సందర్బంగా జిల్లాలోని యాదవ సంఘం ప్రముఖులకు సన్మానించారు. కార్యక్రమంలో నరసన్నపేట మాజీ ఎమ్మెలే బగ్గు రమణమూర్తి, టిడిపి రాష్ట్ర కార్యదర్శి గౌతు శిరీష, పిఎసిఎస్ అధ్యక్షులు కింజరాపు హరివరప్రసాద్, పలాస మున్సిపల్ మాజీ చైర్మన్ వజ్జ బాబూరావు పాల్గొన్నారు.










