Oct 09,2023 22:21

ప్రజాశక్తి-తోట్లవల్లూరు : మండలంలోని వల్లూరు పాలెం గ్రామంలో ఈతకు వెళ్లి కృష్ణా నదిలో మునిగి యువకుడు మతి చెందిన ఘటన సోమవారం గ్రామంలో విషాదం నింపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వల్లూరు పాలెం గ్రామం నుంచి సరదాగా ముగ్గురు యువకులు కృష్ణా నదిలో ఈతకు వెళ్లారు. వీరిలో షేక్‌ నాగుల్‌ మీరా( 20) అదుపుతప్పి మధ్యాహ్నం మూడు గంటల సమయంలో కృష్ణా నది గుండంలోకి జారిపోయి మునిగి గల్లంతయ్యాడు. సమా చారం అందుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల తో గాలించగా సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో మృతదేహం లభ్యమయింది. తండ్రి షేక్‌ బాజీ, తల్లి నాగూర్‌ బి లు విగత జీవిగా పడి ఉన్న తమ కుమారుని చూసి కన్నీరు మున్నీరయ్యారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్సై విశ్వనాథ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.