ప్రజాశక్తి-విజయవాడ అర్బన్: కష్ణా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో డిసెంబర్ 9, 10 తేదీల్లో కష్ణా తరంగ్- 2022 పేరుతో నిర్వహించిన అంతర్ కళాశాలల యువజనోత్సవాల్లో పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల విద్యార్థులు ఓవరాల్ ఛాంపియన్‌షిప్ సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మేకా రమేష్ తెలియజేశారు. ఈ పోటీలలో భాగంగా సాంస్కతిక, సాహిత్య, రంగస్థల, లలిత కళలకు సంబంధించిన 27 అంశాలలో పోటీలు నిర్వహించగా మొత్తం 23 పోటీలలో తమ కళాశాల విద్యార్థినీ విద్యార్థులు బహుమతులు సాధించినట్లు కళాశాల డైరెక్టర్ వేమూరి బాబురావు వెల్లడించారు. కర్నాటిక్/ హిందూస్థానీ గాత్ర సంగీతం, సంప్రదాయ వాయిద్య పరికరాలు, లలిత సంగీతం, శాస్త్రీయ నత్యం, ధ్వన్యనుకరణ( మిమిక్రీ), వ్యంగ్య చిత్రాలు, ప్రహేళిక (క్విజ్), భారతీయ బందగానం, జానపద వాద్య పరికరాలు వంటి పది పోటీల్లో ప్రథమ బహుమతులు, పాశ్చాత్య వాద్య పరికరాలు, చిత్రలేఖనం, పోస్టర్ రూపకల్పన, మట్టితో ఆకతుల తయారీ, చర్చా వేదిక, వ్యర్థ పదార్థాలతో అందమైన ఆకతుల రూపకల్పన, మూకాభినయం, లఘు నాటిక, పాశ్చాత్య బందగానం వంటి 9 పోటీల్లో ద్వితీయ బహుమతులు, కొలేజ్, ముగ్గుల పోటీలు, మెహేంది, నాటకం పోటీలలో తతీయ బహుమతి సాధించినట్లు వెల్లడించారు. వరుసగా నాలుగో సంవత్సరం కష్ణా తరంగ్ ఓవరాల్ ఛాంపియన్షిప్ సాధించటం తమ కళాశాలకు గర్వకారణమని సిద్ధార్థ అకాడమీ కార్యదర్శి పాలడుగు లక్ష్మణరావు, సహకార్యదర్శి నిమ్మగడ్డ లలిత ప్రసాద్, కళాశాల కన్వీనర్ సూరెడ్డి వెంకటేశ్వరరావు కొనియాడారు. ఈ ప్రతిష్టాత్మక విజయం వెనుక తమ కళాశాల సాంస్కతిక విభాగం అధ్యాపకులు డాక్టర్ బి జయప్రకాష్, కే శివరంజని, జి నాగశశాంక, సాహిత్య విభాగం అధ్యాపకులు డాక్టర్ శాంత్ కుమారి, ఏ కవిత, ఎస్ కనకదుర్గల కృషిని కళాశాల డీన్ ప్రొఫెసర్ రాజేష్ జంపాల అభినందించారు.










