ప్రజాశక్తి-ఎడ్యుకేషన్: నగరంలోని మేరిస్ స్టెల్లా కళాశాలలో కృష్ణా విశ్వవిద్యాలయం అంతర కళాశాలల బాస్కెట్‌బాల్ పోటీలు సోమవారం ప్రారంభమయ్యాయి. పోటీలను డిఎస్‌పి కె.ఎస్.ఎస్.శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు, ఇతర సాంస్కృతిక, సామాజిక అంశాలపై కూడా అవగాహన ఉండాలన్నారు. మేరిస్ స్టెల్లా కళాశాల బాస్కెట్‌బాల్ పోటీలు నిర్వహించడం పట్ల కళాశాల యాజమాన్యాన్ని అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని క్రీడా పోటీలను నిర్వహించి ఎంతో మంది మంచి క్రీడాకారులను తీసుకురావాలని కోరారు. ఈకార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జసింతా క్వాడ్రస్, హేమచంద్ర పాల్గొన్నారు.










