Jun 08,2023 00:27

పూజలు నిర్వహిస్తున్న బాచిన కృష్ణ చైతన్య

ప్రజాశక్తి- సంతమాగులూరు : మండల పరిధిలోని పుట్టావారిపాలెం గ్రామంలోశ్రీ హనుమత్‌ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండ రామస్వామి వారి జీవద్వజ పున్ణ ప్రతిష్ట మహోత్సవం బుధవారం వైభవంగా జరిగింది. ఆగమ వ్రవర శ్రీమాన్‌ రొంపిచర్ల వెంకట సత్యనారాయణ చార్యులు, తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర వేద విద్యాలయ అధ్యాపకుల ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శాప్‌ నెట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌, వైసిపి అద్దంకి నియోజకవర్గ ఇన్‌ఛార్జి బాచిన కష్ణ చైతన్య, వైసిపి రాష్ట్ర కార్యదర్శి అట్ల చిన్న వెంకటరెడ్డి స్వామివార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్‌పిటిసి అడవి శ్రీనివాసరావు, సర్పంచులు, ఎంపిటిసిలు, గ్రామపెద్దలు పాల్గొన్నారు.