ధర్నా చేస్తున్న చినచామలాపల్లి గ్రామస్తులు
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : తమకు జీవనాధారంగా ఉన్న భూములను కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటుకు ఇవ్వొద్దని చిన చామలపల్లి గ్రామ గొర్రెలు, మేకలు పెంపకం దార్లు, సిపిఎం నాయకులు రాకోటి రాములు డిమాండ్ చేశారు. ఈమేరకు కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ తమ గ్రామ సర్వే నెంబర్లు 1,2,3,100,101లలో ఉన్న డి-పట్టా, సాగులో ఉన్న కొండపోరంబోకులో సుమారు 150 కుటుంబాలు మొక్కలు వేసుకొని జీవనం సాగిస్తున్నామని తెలిపారు. ఇటీవల ప్రభుత్వం కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటుకు ఈ 50ఎకరాల భూమిని తీసుకుంటుందని మండల రెవెన్యూ అధికార్లు తెలిపారని అన్నారు. ఈ భూమే ఆధారంగా బతుకుతున్న తమ పొట్టకొట్టవద్దని కోరారు. ధర్నాలో జి.తిరుపతిరావు,మజ్జి శ్రీనివాస్,జి.సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.










