
ప్రజాశక్తి - చీరాల
గుంటూరు జిల్లా తాడేపల్లి పీహెచ్సీలో ఆశా వర్కర్‌గా విధులు నిర్వహిస్తున్న కృపమ్మ జగనన్న సురక్ష పని ఒత్తిడి వల్ల గుండెపోటుతో చనిపోయిందని, ఆ కుటుంబానికి రూ.50లక్షలు ఆర్ధిక సాయం ప్రభుత్వం చెల్లించాలని ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి వెంకటేశ్వరమ్మ డిమాండ్ చేశారు. మండలంలోని ఈపురిపాలెం పిహెచ్సి వద్ద బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలతో శనివారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా సిఐటియు కార్యదర్శి ఎం వసంతరావు మాట్లాడుతూ ఆశా వర్కర్లకు పని భారంపరతంగా పెరిగిందని అన్నారు. అధికారుల వేధింపులు పెరిగాయన్నారు. ఆశా వర్కర్లకు పండుగ సెలవు లేదని చెప్పారు. కృపమ్మ కుటుంబంలో ఉద్యోగం ఇవ్వాలని కోరారు. లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని అన్నారు. అనంతరం పిహెచ్‌సి డాక్టర్‌కు వినతి పత్రం అందజేశారు.