ప్రజాశక్తి - ఆదోని
వర్షాభావ పరిస్థితుల కారణంగా సాగు చేసిన పంటలు చేతికందక కరువుతో అల్లాడుతున్నా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి స్పందించకపోవడం దారుణమని మాజీ ఎమ్మెల్యే, టిడిపి ఇన్‌ఛార్జీ మీనాక్షి నాయుడు తెలిపారు. గురువారం మండలంలోని బైచిగేరి గ్రామంలో 'బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారెంటీ' నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ కరపత్రాలను, బాండ్లను అందించి సూపర్ సిక్స్ పథకాలపై అవగాహన కల్పించారు. ప్రజావేదిక సమావేశంలో మీనాక్షి నాయుడు మాట్లాడారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండకట్టి, టిడిపి చేపట్టే పథకాలను ప్రజలకు వివరించాలని తెలిపారు. బాబు అధికారంలోకి వస్తే చేపట్టబోయే అభివృద్ధి, సంక్షేమాల గురించి వివరించారు. రామస్వామి, రంగన్న, ఆరేకల్ రామకృష్ణ, దొడ్డనకేరి శివప్ప, ధన సింగ్, రాముడు, లక్ష్మన్న, నాగరాజ్, భగవాన్ సింగ్, హనుమసింగ్, రాజు, రాఘవేంద్ర పాల్గొన్నారు.