Oct 17,2023 17:00

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సిపిఎం నాయకులు

కరువు సహాయక చర్యలు తక్షణమే చేపట్టాలి : సిపిఎం
ప్రజాశక్తి - పగిడ్యాల

      తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం అందించి కరువు సహాయక చర్యలు తక్షణమే చేపట్టాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం  నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రం పగిడ్యాల లో విలేకరుల సమావేశంలో నాగేశ్వరావు మాట్లాడారు.  మండలంలోని ముచ్చుమరి, బీరవోలు, ఆంజనేయ, పగిడ్యాల, లక్ష్మాపురం గ్రామాల్లోని పంట పొలాలను పరిశీలించడం జరిగిందన్నారు. ఈ సంవత్సరం తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు ఎండిపోయి రైతులు అప్పుల ఊబిలో కోరకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మెట్ట ప్రాంతంలోని మొక్కజొన్న, మినుము, పత్తి తదితర పంటలు వర్షాలు లేక పూర్తిగా ఎండిపోయాయన్నారు. కెసిఆర్ కట్టు కింద సాగు చేసిన పంటలైన కైనా కాపాడుకుందామని రైతు ప్రయత్నిస్తే కేసీఆర్ కట్టుకుని నీళ్లు వదలడంలో సంబంధిత అధికారులు ఘోరంగా విఫలం చెందారని మండిపడ్డారు. నాగటూరు ఎత్తిపోతల పథకం ద్వారా అయినా నీటిని విడుదల చేసి ఉంటే పంటలు కాపాడుకునే వాళ్ళమని రైతులు పేర్కొంటున్నారని వారు అన్నారు. కేసీ కెనాల్ కు, నాగటూర్ ఎత్తిపోతల పథకానికి నీళ్లు వదలకుండా రైతులను ఆదుకోకుండా ప్రభుత్వం విఫలం చెందిందని ఆయన విమర్శించారు. పగిడ్యాల మండలంతోపాటు నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాలను కరువు మండలాల ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎకరాకు రూ 50 వేలు నష్టపరిహారం అందించి రైతులను ఆదుకోవాలని అన్నారు. రైతులు పంటల కోసం తీసుకున్న బ్యాంకు రుణాలను మాఫీ చేసి రబీ సీజన్ పంటలు సాగు చేసుకునేందుకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. వ్యవసాయ కూలీలకు పనులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద వ్యవసాయ కూలీలకు 200 రోజులు పని కల్పించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కూలీలకు ఆరు నెలల పాటు రూ 2 వేల పెన్షన్ మంజూరు చేయాలని, ప్రభుత్వ చౌక దుకాణాల ద్వారా 15 రకాల నిత్యవసర సరుకులు అందించి వ్యవసాయ కూలీలను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.  లేని ఎడల సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పకీర్ సాహెబ్, గోపాలకృష్ణ, హుస్సేనామ్మ, సప్లయర్ వెంకటేశ్వర్లు, బాబు, బుజ్జన్న, ఉరుకుంద వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.