వినతిపత్రం అందజేస్తున్న నాయకులు
ప్రజాశక్తి - మంత్రాలయం
మంత్రాలయం మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించి కరువు సహాయక చర్యలు చేపట్టాలని కెవిపిఎస్ నాయకులు వీరేష్ డిమాండ్ చేశారు. శనివారం మండలంలోని సూగూరు గ్రామ సచివాలయంలో మహిళా కానిస్టేబుల్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం, పంటల బీమా చెల్లించడంతో పాటు పంటల సాగు కోసం తీసుకున్న రుణాలను మాఫీ చేయాలని కోరారు. రైతులు జి.నాగరాజు, జి.జయన్న పాల్గొన్నారు.










