Nov 04,2023 21:11

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి

రామాపురం :
కరువు పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొంటామని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. శనివారం స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో మండల అభివృద్ధిపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గడికోట-కాలేటివాగు జిఎన్‌ఎస్‌ఎస్‌ పనులుపై ఇరిగేషన్‌ అధికారులుతో ఆరా తీశారు. వెలిగల్లు ప్రాజెక్ట్‌ నుంచి దొర్రిచెరువు 56 కిమీ వరకు రామరాజు వంక వరకు కాలువల ద్వారా చెరువులకు నీరు చేరుతోందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ దూరదష్టితో ప్రాజెక్టులను నిర్మించారన్నారు. రైతులకు తోడుగా నిలుద్దామన్నారు. ఈ ఏడాదిలో పదున్ల వాన కూడా పడలేదన్నారు. రామాపురం మండలాన్ని ప్రభుత్వం కరువు మండలంగా ప్రకటించిందన్నారు. డిసెంబర్‌ 6 వరకు వెలిగల్లు నీటిని విడుదల చేయిస్తామన్నారు. నీటిని వ ధా కానీవ్వకుండా అన్ని చెరువులను నీటితో నింపుతామన్నారు. మండలంలో 1800 ఎకరాలలో రైతులు పంటలు సాగుచేసారని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. వ్యవసాయానికి ఏడు గంటల పాటు విద్యుత్‌ సరఫరా జరుగుతోందని తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా నాలుగేళ్లలో 5600 వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు(ట్రాన్స్‌ ఫార్మర్లు) అందించినట్లు చెప్పారు. చుక్కల భూముల విషయంలో రైతులకు శాశ్వత పరిష్కారాన్ని వైసిపి ప్రభుత్వం చూపించిందన్నారు. ఈ నెల 15 నుంచి పేదలకు భూ పట్టాలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. అసైన్‌మెంట్‌, చుక్కల భూముల వివరాలును నోటీస్‌ బోర్డ్‌లలో పెట్టాలని సూచించారు. అవినీతి రహితంగా రైతులకు సేవలు అందించి మంచి పేరు తెచుకోవాలని, సంక్రాంతికి బట్టలు పెట్టి గౌరవిస్తా మన్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్‌ జనార్దన్‌రెడ్డి, మండల ఉపాధ్యక్షులు, రవిశంకర్‌రెడ్డిబాబు, జడ్‌పిటిసి వెంకటరమణ, సర్పంచ్‌ నాగభూషణ్‌రెడ్డి, సింగల్‌ విండో అధ్యక్షులు పెద్దిరెడ్డి ఆదినారాయణరెడ్డి, వడ్డెర కార్పొరేషన్‌ డైరెక్టర్‌ ఆంజనేయులు, తహశీల్దార్‌ అరవింద కిషోర్‌, ఎంపిడిఒ హైదరవల్లి, సర్పంచులు, ఎంపిటిసిలు పాల్గొన్నారు.