కడప అర్బన్ వైసిపి ప్రభుత్వానికి రాజకీయ ఎజెండా తప్ప ప్రజల అజెండా లేదని, 65 శాతం ఉన్న అన్నదాతల కన్నీటి ధారలు తెలియాలంటే ప్రజాప్రతినిధులు పల్లెబాట పట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి జి. చంద్రశేఖర్ పేర్కొన్నారు. సోమవారం సిపిఎం జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో కరువు నివారణ చర్యలు చేపట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందా యని విమర్శించారు. చినుకులు లేక కర్షకుల బతుకులు చిధ్రమయ్యాయని తెలిపారు. పచ్చని పంటలకు నీటి తడులు అందక మాడిపోతున్నాయని, అన్నదాత దుర్భర పరిస్థితుల్లో అండగా నిలవాల్సిన సర్కారు భరోసా పట్టించుకోక రైతుల బాధలు అరణ్య రోదనగా మారాయి అన్నారు. కష్టాల కౌగిట్లో రైతులు పుట్టెడు దుఃఖంలో అన్నదాతల ఆర్తనాదాలు కన్నీటి ధారలు ప్రభుత్వాలకు పట్టడం లేదన్నారు. కడప జిల్లాలో 17 ఖరీఫ్ సీజన్‌లో సాధారణ సాగు విస్తీర్ణంలో సగం కూడా ఈ ఏడాది సాగు చేయలేదని, చేసిన సాగు కూడా తీవ్రమైన వర్షాభావ పరిస్థితుల కారణంగా ఎండిపోయిందన్నారు. కరెంటు కోత భూగర్భ జలాల కొరత పశుగ్రాసం కొరత ఉపాధి హామీ పథకం నిర్లక్ష్యం చేయ టంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ సంక్షో భంలోకి నెట్టబడిందన్నారు. కడప జిల్లాలోని 36 మండలాలలో 17 మండ లాలు తీవ్రమైన కరువును ఎదుర్కొ ంటున్నాయని వారు ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయని అన్నారు. కరువు అంచనా పంటలను నష్టపరిహార అంచనా వేరేది వేసే ప్రభుత్వ అధికారులకు ఎన్నికల పనులు ఆరు నెలల ముందే అప్పగించడం ద్వారా కరువు అంచనా వేలేకున్నారన్నారు. అన్నదాత కన్నీటి ధారలు తెలియాలంటే ప్రజాప్రతినిధులు పల్లెబాట పట్టాలన్నారు. 119 ఏళ్ల నాటి కరువు కడప జిల్లాలో నేడు తాండవిస్తోందని కానీ కరువు నివారణ చర్యలు రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలే సిందన్నారు. వైఎస్‌ఆర్ జలకలకు నిధులు నిలిపివేయడంతో వేయాల్సిన బోర్లు వేయకుండా కాంట్రాక్టర్లు జారు కుంటున్నారన్నారు. ఖరీఫ్‌లో సన్న కారు చిన్న కారు కవులు రైతులు నష్టపోయిన పంటలకు పూర్తి నష్టపరిహారం ప్రభుత్వమే చెల్లించాలని రవి పంటకు ఆర్థిక సహకారం బ్యాంకుల ద్వారా ప్రభుత్వం అందించాలని, రైతాంగ బ్యాంకు రుణాలు రీ షెడ్యూల్ చేయాలని డిమాండ్ చేశారు. తుంగభద్రా నది పరివాహక సాగు రైతుల కరువును, ప్రకతి వైపరీత్యాన్ని అంచనా కట్టిన కర్ణాటక ప్రభుత్వం 2023, సెప్టెంబర్ లోనే కేంద్ర కరువు బందాన్ని పర్యటించాలని డిమాండ్ చేసిందని తెలిపారు. అదే పరివాహక ప్రాంతంలో ఉన్న రాయలసీమ, కడప జిల్లా లో కేంద్ర కరువు బందం పర్యటించాలని నేటి వరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి నివేదించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిద్రావస్థలో ఉందని పేర్కొన్నారు. రాష్ట్రం లో ఎన్నికలు ఆరు నెలల కాలం తర్వాత ఉన్నా ఇప్పటినుండే వైసిపి ప్రభుత్వానికి ఎన్నికల పిచ్చి, జ్వరం పట్టుకునిందని పేర్కొన్నారు. రైతుల పాలిట అది శాపంగా మారిందని విమర్శించారు.