వినతిపత్రం అందజేస్తున్న నాయకులు
తనకల్లు : తనకల్లు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని సిపిఎం, ఎపి రైతుసంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు స్థానిక తహశీల్దార్ శోభాసువర్ణమ్మకు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్లో వేసిన పంటలు వర్షాభావం వలన పూర్తిగా ఎండిపోయాయన్నారు. ప్రస్తుతం కురుస్తున్న అరకొర వర్షాలకు ప్రత్యామ్నాయ పంటలు వేయడానికి విత్తనాలు సరఫరా చేయడంలో వ్యవసాయశాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు.కరువు మండలంగా ప్రకటించి రుణాలన్నీ మాఫీ చేయాలని, నాణ్యమైన విద్యుత్ ను కోతలు లేకుండా అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులుశివన్న, వివి. రమణ తదితరులు పాల్గొన్నారు.










