జిల్లాలో కరువు మండలాల ఎంపిక కసరత్తు ఊపందుకుంది. 2023-24 ఖరీఫ్ సీజన్ వర్షపాతం లేమి కారణంగా ఎదురైన తీవ్ర దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం కరువు మండలాల ఎంపిక ప్రమాణాల ఆధారంగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో రాజకీయ పరి స్థితులు వేడెక్కిన నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జిల్లాలో కరువు మండలాలను ప్రకటిస్తే ఎంతటి దుమారం రేగుతుందోననే అందోళనతో కరువు మండలాలను ప్రకటించే అవకాశం లేదనే వాదన వినిపిస్తోంది.ప్రజాశక్తి - కడపప్రతినిధి
ఖరీఫ్ సీజన్ తీవ్ర దుర్భిక్ష పరిస్థితులను ఎర్కొంటోంది. జిల్లాలో 36 మండలాలున్నాయి. 2023-24 ఖరీఫ్ సీజన్‌లో 2,11,553 ఎకరాల్లో పంటలు సాగు చేయాలనే జిల్లా వ్యవసాయశాఖ లక్ష్యానికి గండి పడింది. 1,48,889 ఎకరాల్లోనే విత్తనం పడింది. ఈలెక్కన 60 నుంచి 70 వేల ఎకరాలు బీళ్లుగా మారిన దృశ్యం దర్శనమిస్తోంది. ఇదిలాఉండగా వర్షాభావ పరిస్థితుల నెలకొన్న నేపథ్యంలో 381 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 358 మి.మీ నమోదైన నేపథ్యంలో వర్షభావ పరిస్థితుల్లో సాగు విస్తీర్ణంలో కోత, తాగునీటి ఎద్దడి, పడిపోతున్న భూగర్భజలాలు, పశుగ్రాసం, ఉపా ధికి హామీ కొరవడడం, వలసలు తదితర ఆరు రకాల పారా మీటర్లను పరిగణలోకి తీసుకుని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ప్రధానంగా జిల్లాల్లోని 36 మండలాల్లో డ్రైస్పెల్స్ బారిన పడిన 17 మండలాలను ప్రధా నంగా పరిశీలించినట్లు తెలుస్తోంది. ఇందులో బి.మఠం, కాశినాయన, పోరుమామిళ్ల, బద్వేల్, గోపవరం, చాపాడు, ప్రొద్దుటూరు, పులివెందుల, యర్రగుంట్ల, అట్లూరు, ఒంటిమిట్ట, పెండ్లిమర్రి, చక్రాయపేట సహా మరో నాలుగు మండలాలను ఎంపిక చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
జిల్లాలో కరువు మండలాలను ఎంపిక చేసినప్పటికీ ఆమోదం లభించడం అను మానమేననే వాదన వినిపిస్తోంది. రాష్ట్రంలో నెల కొన్న రాజకీయ పరిస్థితులు జిల్లా రైతాంగానికి శాపంగా మారే అవ కాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత జిల్లాలోనే కరువు తాండవం చేస్తున్నట్లు ప్రకటిస్తే రాజకీ యంగా విమర్శలు ఎదుర్కోవడంతోపాటు నష్టపోయే అవకాశాలను బేరీజు వేసుకుని కరువు మండలాలను ప్రకటించే అవకాశాలు లేవనే వాదన వినిపిస్తోంది.