ప్రజాశక్తి - రంపచోడవరం
మండలంలోని పందిరిమామిడి వద్ద ఉన్న కృషి విజ్ఞాన కేంద్రంలో కర్ర పెండలం, చిలకడ దుంపలతో తయారు చేసే ఉత్పత్తులపై నైపుణ్యాభివృద్ది శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. రెండో రోజు శుక్రవారం కార్యక్రమంలో పెద్దాపురం ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం.జానకి మాట్లాడుతూ కర్ర పెండలం, చిలకడ దుంపల్లో ఉండే పోషక విలువల ప్రాముఖ్యతను వివరించారు. వాటితో చిప్స్, బిస్కెట్లు, మురుకులు మిక్చర్, అప్పడాలు, సుగ్గు బియ్యం పాస్తా, జల్లి పండి బొబ్బట్లు తదితర ఉత్పత్తుల తయారీ విధానం, వాటి మార్కెట్ ప్యాకింగ్ పద్ధతులను తెలియజేశారు. వాటి తయారీ ద్వారా మహిళలు స్వయం ఉపాధి పొందవచ్చని చెప్పారు. కెవికె శాస్త్రవేత టి.క్రాంతి కుమార్, కె.వీరాంజనేయులు, ఎస్.ఆదర్శ, పి రాజశేఖర్, పలు మండలం నుండి మహిళలు పాల్గొన్నారు.










