ఏ దారి వెంట వచ్చావో
మా దారులన్నీ మూసేశావు
ఎటునుండి వచ్చావో కానీ
ప్రపంచం మొత్తం చేరిపోయావు..
పల్లె లేదు పట్టణం లేదు
ఊరు వాడ ఏదీ లేదు
ఏ దేశాన్నీ వదల లేదు
పేద లేదు ధనిక లేదు
జనుల నెవ్వరిని వదలలేదు
ఏ ప్రాణిని వదలడం లేదు
మా ప్రాణమంటే జాలి లేదు
మనుషులంటే అసలు నీకు లెక్కలేదు...
ఆర్థికంగా దేశాలను దిగజార్చావు
ఉద్యోగ ఉపాధులను కోల్పోయేలా చేశావు.
బతుకంటే భయం అని తెలియజేశావు
బతుకు బతకాలంటే భారం చేశావు...
చుట్టాన్ని దూరం చేశావు
పక్కోడితో మాట్లాటకుండా చేశావు
దేన్నీ ముట్టకుండా చేశావు
ఒకరికొకరిని దూరం పెట్టేశావు...
ఏ ప్రాణిని విడువకుండా
రోగాల పాలు చేశావు
ఏ ఒక్కరిని వదలకుండా
ప్రాణాలను తీస్తున్నావు...
ఏ మందుకు లొంగలేదు
టీకాలు వచ్చినా పోతలేవు
ఏమి చేస్తే పోతావో
ఇంకేమి చేస్తే చస్తావో మాకైతే
తెలియడం లేదు...
ఇంకెప్పుడు మమ్ముల వదులుతావే కరోనా..!
నీ అంతం ఇంకెప్పుడే మాకు జర నువ్వే బోలోనా..!!
- రాజేష్.. వేములవాడ