ప్రజాశక్తి - హోళగుంద
అక్రమంగా బొలెరో వాహనంలో తరలిస్తున్న 3,360 కర్ణాటక టెట్రా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి శనివారం తెలిపారు. ఈడిగ వీరేష్ అనే వ్యక్తి బొలెరో వాహనంలో కర్ణాటక మద్యం తరలిస్తుండగా సమ్మతిగేరి క్రాస్ వద్ద పట్టుకున్నట్లు చెప్పారు. ఎస్‌ఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో వాహనాన్ని పట్టుకొని 3,360 కర్ణాటక టెట్రా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వీటి విలువ ఓపెన్ మార్కెట్‌లో సుమారు రూ.3.50 లక్షలు ఉంటుందన్నారు. నిందితుని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు తెలిపారు. కర్ణాటక నుంచి ఆంధ్రాకు బొలెరో వాహనంలో తరలిస్తున్న మద్యం ప్యాకెట్లను పట్టుకున్నందుకు ఎస్‌ఐ శ్రీనివాసులును డీఎస్పీ శ్రీనివాసరెడ్డి అభినందించారు. ఆలూరు సిఐ వెంకటేశ్వర్లు, పోలీసులు షేక్షావలీ, పెద్దన్న, గురు ప్రసాద్, రామాంజనేయరెడ్డి, వీరాంజనేయులు పాల్గొన్నారు.
మద్యాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు










