ప్రజాశక్తి - ఎమ్మిగనూరు రూరల్
కర్ణాటక మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, ఒక కారును సీజ్ చేసినట్లు సెబ్ సిఐ జయరామనాయుడు మంగళవారం తెలిపారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడారు. మాధవరం చెక్ పోస్ట్ దగ్గర సెబ్ ఎస్‌ఐ సోమశేఖర రావు, బృందం వాహనాలు తనిఖీలు చేపట్టారని తెలిపారు. మద్యం సరఫరా చేస్తున్న కారు అనుమానంగా రావడంతో తిరిగి వెనక్కి పోయే ప్రయత్నం చేస్తుండగా ఆ కారును అడ్డగించి తనిఖీ చేసినట్లు చెప్పారు. 21 బాక్సుల్లో 2,016 (90 మిల్లీలీటర్లు) ఒరిజినల్ ఛాయిస్ విస్కీ టెట్రా ప్యాకెట్లను గుర్తించారన్నారు. మంత్రాలయం మండలం రచ్చమర్రి గ్రామానికి చెందిన పల్లెపాడు లక్ష్మయ్య, కడతట్ల వీరేష్, ఎమ్మిగనూరు మండలం గుడికల్ గ్రామానికి చెందిన బోయ యువరాజుకు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. కర్ణాటక మద్యాన్ని తరలిస్తున్న ముగ్గురిపై కేసు నమోదు చేసి టాటా మంజ కారు సీజ్ చేసినట్లు చెప్పారు. సీజ్ చేసిన ఉద్యమం విలువ రూ.1,05,000 ఉంటుందన్నారు. చంద్రమోహన్, హెడ్ కానిస్టేబుళ్లు గోపాల్, లింగప్రసాద్, షరీఫ్, రబ్బాని, కానిస్టేబుళ్లు రామచంద్ర, నరసింహారెడ్డి, రాధమ్మ, అయ్యన్న, రామకృష్ణ పాల్గొన్నారు.
మాట్లాడుతున్న సెబ్ సిఐ జయరాం నాయుడు










