ప్రజాశక్తి-చీరాల: విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించడం వలన జీవితంలో ఉన్నత శిఖరాలు అందుకుంటా రని వూర మస్తాన్‌రావు అండ్ శివరాజకుమారి ట్రస్ట్ ప్రతినిధులు మస్తాన్‌రావు పేర్కొన్నారు. గత వారం నుంచి చీరాల మండల పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని సుమారు 1100 మంది 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష అట్టలు, పెన్నులు, పెన్సిళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మస్తాన్‌రావు మాట్లాడుతూ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ఇటీవల పాఠశాలలకు నోటీస్ బోర్డులు కూడా అందించినట్లు చెప్పారు. అన్నదానాలు కూడా చేసినట్లు వివరించారు. సహకరించిన ట్రస్ట్ సభ్యులు చారుగుళ్ల గురుప్రసాద్, పాగోలు గాంధీ, డివిడి ప్రసాద్, పాబోలు భాస్కరరావు మరియ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు.










