
ప్రజాశక్తి-సాలూరు : క్రమశిక్షణతో కూడిన విద్య అభ్యసించిన విద్యార్ధులే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని టౌన్ సిఐ సిహెచ్.శ్రీనివాసరావు చెప్పారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా గురువారం పట్టణంలోని శ్రీ సత్యసాయి డిగ్రీ కళాశాలలో విద్యార్ధులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులు తల్లిదండ్రులు, గురువులను గౌరవించాలని కోరారు. సెల్‌ఫోన్ వినియోగంపై దృష్టి తగ్గించి విద్యార్ధిగా నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించడానికి కృషి చేయాలని కోరారు. అనంతరం మహిళా రక్షణపై విద్యార్ధులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టౌన్ ఎస్‌ఐలు పి.నరసింహమూర్తి, ఎన్.భాస్కరరావు, కళాశాల ప్రిన్సిపల్ భాస్కరరావు, రామానుజన్ మేథ్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ రంభ రజనీకాంత్ పాల్గొన్నారు.