Oct 04,2023 22:51

 ప్రెషర్స్‌ డే వేడుకల్లో కెయు ఉపకులపతి జి.జ్ఞానమణి
ప్రజాశక్తి-మచిలీపట్నం రూరల్‌ :
కృష్ణా విశ్వ విద్యాలయం ఇంజ నీరింగ్‌ కళాశాల ఆధ్వర్యంలో మొదటి సంవత్సరం చదువుచున్న ఇంజనీరింగ్‌ ప్రెషర్స్‌ డే ప్రోగ్రామ్‌ నిర్వ హించారు. ఈ కార్యక్ర మానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన, విశ్వవిద్యాలయ ఉపకులపతి జి.జ్ఞానమణి మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణలో, అంకిత భావంతో చదువుకోవాలని నిర్దేశించారు. విద్యార్థులకు కావాల్సిన అన్ని సదుపాయలను విశ్వ విద్యాలయాలకు అధికారులు సమకూ ర్చుతారని అభయ మిచ్చారు. రిజిస్ట్రార్‌ పి. బ్రహ్మచారి మాట్లాడుతూ విద్యార్థులు వారికి నిర్దేశించిన విధి, విధాలను క్షుణ్ణంగా తెలుసుకోవాలని, తదనుగుణంగా బాగా చదువుకొని వద్దిలోనికి రావాలని ఉపదేశించారు. ప్రిన్సిపాల్‌ డా ఆర్‌.విజయ కుమారి మాట్లాడుతూ విశ్వవిద్యాలయం అందిస్తున్న సౌకర్యాల న్నిటిని గ్రంథాలయాలు, ల్యాబలే టరీలు ఇండోర్‌ స్టేడియం, ఆట స్థలాలు వంటివాట్ని ఉపయోగించుకొని విద్యార్థులు చక్కగా విద్యనభ్యసించి, అన్ని విధాల వద్దిలోనికి రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భాగంగా లక్ష్యసాధనకు వ్యక్తిగత ప్రేరణ మరియు ఏర్పాటు అనే అశం గురించి ఆంగ్ల ఆచార్యులు మరియు వైస్‌ ప్రిన్సిపాల్‌, ఆర్ట్స్‌అండ్‌ సైన్స్‌ ఎమ్‌. కోటేశ్వరరావు ప్రసంగించారు. ఆర్ట్స్ట్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల ప్రన్సిపాల్‌ వై కే సుందర కష్ణ మారుతున్న టెక్నాలజీ అందిపుచ్చుకుని విద్యార్థులు భవిష్యత్తుకు బాటలు వేసుకోవానికి కోరారు ఈ సందర్భంగా ప్రొఫెసర్‌ కోటేశ్వరావు ను సత్కరించారు.