ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే కోన రఘుపతి
ప్రజాశక్తి- కర్లపాలెం : రంజాన్ సందర్భంగా షాదీషానాలో సోమవారం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి పాల్గొన్నారు. తొలుత మసీదులో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు గుండ్రెడ్డి శివ, ఎంపిపి యారం వనజ, జడ్‌పిటిసి వేణుగోపాల్ రెడ్డి, వైసిపి మండల కన్వీనర్ సీతారామరెడ్డి, ఉపాధ్యక్షుడు సుబ్బారావు, ఎంపిటిసి షేక్ ఆసిఫ్ ఆలీ, తాండ్ర సాంబశివరావు, లక్ష్మణ, కో ఆప్షన్ సభ్యులు అమీర్ బేగ్, ఉప సర్పంచి పఠాన్, యూత్ ప్రెసిడెంట్ ఏడుకొండలు, ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ నాగేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.










